హనుమాన్ మూవీలో చిరూ?
చిన్న సినిమాలకు చిరంజీవి ఎప్పుడూ సాయం చేస్తాడన్న విషయం తెలిసిందే. ఆ సినిమాను ప్రమోట్ చేయడం, ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వెళ్ళడం, వాయిస్ ఓవర్స్ ఇవ్వడం ఇలా చాలానే చేస్తుంటాడు. చిరూ రిఫరెన్సులను కూడా చాలా మంది వాడుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న హను మాన్ చిత్రంలో చిరూ ను కొత్తగా వాడుకున్నారు.
ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ మేరకు ఓ హింట్ ఇచ్చాడు. ఈ సినిమాలో హనుమంతుడి క్యారెక్టర్ ను గ్రాఫిక్ రూపంలో చూడబోతున్న విషయం తెలిసిందే. కానీ ఆ లుక్ ను పూర్తి స్థాయిలో ఇప్పటివరకు చూపించలేదు. ట్రైలర్ లో కూడా హనుమంతుడి కళ్ళ వరకే చూపించారు. అయితే ఆ కళ్ళు చూసిన అందరూ అవి చిరూ కళ్ళే అంటున్నారు.
దీంతో హను మాన్ లో చిరంజీవి క్యామియో చేశాడని గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఓ ఇంటర్వ్యూలో హింట్ ఇచ్చాడు. హనుమంతుడి క్యారెక్టర్ ఎవరు చేశారో, ఆ రూపం ఎలా ఉంటుందనేది తెర మీదే చూసి తెలుసుకోవాలన్నాడు. హనుమంతుడిని చిరులా చూపించాలా అనే విషయం గురించి తమ టీమ్ లో కొన్ని రోజులు డిస్కషన్ జరిగిందని, కానీ తామేం చేశామా అనే విషయం సస్పెన్స్ అని, అదేంటో స్క్రీన్ మీదే చూడాలని, స్క్రీన్ పై చూశాక ఆడియన్స్ కచ్ఛితంగా సర్ప్రైజ్ అవుతారని ప్రశాంత్ వర్మ చెప్తున్నాడు.













