అభిమానులకు అండగా మెగాస్టార్ చిరంజీవి
అభిమానులకు కష్టమొచ్చినపుడు మెగాస్టార్ చిరంజీవి అండగా నిలుస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన తన అభిమాని కుటుంబానికి అండగా నిలిచారు. పదేళ్లుగా ఆ అభిమాని కూతురు చదువుకు పూర్తి ఆర్థికసాయాన్ని అందజేస్తున్నారు. హయత్నగర్ మండల చిరంజీవి యువత మాజీ అధ్యక్షుడు డి.సురేష్ 2010లో రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పుడు సురేష్ కుటుంబాన్ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడతానని, సురేష్ కూతురు ఆశ్విత చదువు పూర్తి అయ్యే వరకూ ఖర్చులన్నీ తానే భరిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు పదేళ్లుగా చిరంజీవి భారత సేవా సహకార పోరం అధ్యక్షుడు బసవరాజు శ్రీనివాస్ ద్వారా ప్రతి ఏడాది ఆశ్వితకు స్కూల్ ఫీజును అందజేస్తునానరు. ఈ ఏడాది ఫీజు రూ.10 వేల చెక్కును చిరంజీవి యువత రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మోడెపు సత్యనారాయణ గౌడ్ అశ్వితకు అందజేశారు. మెగాస్టార్ ఆశీస్సులతో అశ్విత మంచి చదువులు చదువుకుని భవిష్యత్లో మంచి ఉద్యోగం చేయాలని ఆకాంక్షించారు.













