రెండు కొత్త చిత్రాలకు మెగాస్టార్ గ్రీన్‌సిగ్నల్
చిరంజీవి సినీ కార్మికులకు నిత్యావసరాలు అందించడంపై ఒక పక్క కీలకంగా ఉంటూనే మరో పక్క కొత్త కథలనూ వింటున్నారు. తాజాగా రెండు చిత్రాలు చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అందులో మొదటది మలయాళంలో విజయం సాధించి లూసిఫర్. సాహో దర్శకుడు సూజిత్ కాంబినేషన్లో రీమేక్ చేయబోతున్నారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సూజిత్, సుకుమార్‌తో కూడిన బృందం ఈ సినిమాలోని మార్పులు చేర్పులు చేసే పనిలో పడింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కనుంది. జై లవకుశ దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబి)తో మరో సినిమా చేయబోతున్నారు చిరంజీవి. ఆయన చెప్పిక కథ మెగాస్టార్‌ని మెప్పించిందట. ఆ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రం ఈ ఏడాది చివరిలో గానీ వచ్చే ఏడాది మొదటి రెండు నెలల్లో గానీ పట్టాలెక్కే అవకాశం ఉంది.













