Chiranjeevi: మరో సినిమాకు ఓకే చెప్పిన మెగాస్టార్

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆల్రెడీ వశిష్ట(vassishta) దర్శకత్వంలో విశ్వంభర(viswambhara) షూటింగ్ ను పూర్తి చేసి, దాన్ని రిలీజ్ కు రెడీ చేస్తున్న చిరూ(chiru), మరోవైపు అనిల్ రావిపూడి(anil ravipudi) దర్శకత్వంలో మన శంకరవరప్రసాద్ గారు(mana shankaravaraprasad Garu) షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలను కూడా చిరంజీవి లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే.
ఆ రెండింటిలో ఒకటి వాల్తేరు వీరయ్య(waltair veerayya) ఫేమ్ బాబీ కొల్లి(bobby kolli) దర్శకత్వంలో కాగా, మరోటి దసరా(dasara), ది ప్యారడైజ్(the paradise) ఫేమ్ శ్రీకాంత్ ఓదెల(Srikanth odela) దర్శకత్వంలో. ఈ రెండింటిలో బాబీ కొల్లి సినిమాను నవంబర్ లో పూజా కార్యక్రమాలతో లాంచ్ చేయనున్నారు మెగాస్టార్. ఏడు పదుల వయసులో కూడా మెగాస్టార్ ఈ రేంజ్ స్పీడు చూపించడాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. డైరెక్టర్ వెంకీ కుడుముల(venky kudumula), చిరూ కోసం ఓ కామెడీ ఎంటర్టైనర్ ను రెడీ చేసి, ఆయనకు వినిపించగా, చిరూ కూడా ఈ ప్రాజెక్టుపై ఇంట్రెస్టింగ్ గా ఉన్నారని తెలుస్తోంది. వాస్తవానికి వీరిద్దరి కాంబోలో సినిమా ఇప్పటికే రావాల్సింది కానీ ఫైనల్ స్క్రిప్ట్ దగ్గర సినిమా ఆగింది. ఇప్పుడు ఈ సినిమాకు చిరూ ఓకే అన్నారని వార్తలొస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడయ్యే ఛాన్సుందని అంటున్నారు.