మెగాస్టార్ నట వారసురాలు రాబోతుంది…!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వాల్తేరు వీరయ్య. సంక్రాంతి సందర్భంగా విడుదలవుతున్న ఈ చిత్రం ఇప్పటికే చాలా వారికి షూటింగ్ ని పూర్తి చేసుకుంది. చిరంజీవికి జంటగా శృతి హాసన్ నటించగా, కీలక పాత్రలో రవితేజ కనిపించబోతున్నారు. ఇటీవల విడుదలైన బాస్ పార్టీ ప్రోమోలు లిరికల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రం గురించి నెక్స్ట్ అప్ డేట్ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్న తరుణంలో తాజాగా వచ్చిన అప్డేట్ తో మెగా ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. వాల్తేరు వీరయ్య చిత్ర టీం ఈ సినిమాకి విలక్షణ ప్రచారాన్ని కోరుకుంటుంది. ఈ నేపథ్యంలో బాస్ పార్టీ ప్రచారానికి నేరుగా చిరు మనవరాలు, సుష్మిత కొణిదెల కూతురు సంహిత భాగం అవ్వడంతో మెగా ఫాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే..ఈ సాంగ్ కి మెగాస్టార్ మనవరాలు స్టెప్స్ అదనపు ఆకర్షణగా మారింది. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తో కలిసి సంహిత వేస్తున్నస్టెప్స్ స్టిల్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల చిరు కుటుంబం మొత్తం యూరోప్ ట్రిప్ కి వెళ్లిందన్న సంగతి తెలిసిందే. అక్కడే ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. వీరయ్య సినిమాలో నేను సైతం అంటూ చిరు మనవరాలు కూడా ఈ షూటింగ్ లో పాల్గొనడం విశేషం.
సినీ కళా రంగానికి మెగా ఫ్యామిలీ చేస్తున్న సేవలు అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఈ కుటుంబం నుండి పలువురు హీరోలుగా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు. ఈ కుటుంబం నుండి వచ్చిన మెగా వారసురాలు నిహారిక కొణిదెల ఆల్రెడీ సినిమాల్లో బిజీగా ఉంది. ఇదే ఇండస్ట్రీలో సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్ గా కొనసాగుతుంది. మెగా మనవరాళ్లు కూడా సినీ రంగానికే ఆసక్తి చూపిస్తున్నారు.
సుష్మిత కూతురు సంహిత కొణిదెల కి నటన అంటే చాలా ఇష్టం. తాను ఇప్పటికే ఇంట్లో నటనను ప్రాక్టీస్ చేస్తుంది. తాతగారు వినిపించే క్లాస్ ని ఫాలో అవుతుందని కథనాలు వచ్చాయి. మెగా ఫ్యామిలీ నుండి నిహారిక తర్వాత నట వారసురాలిగా సంహిత ఈ రంగంలోకి అడుగుపెడుతుంది. తన నటనతో మెగా అభిమానులని ఈ చిన్నారి ఆకట్టుకుంటుందా లేదా అని వేచి చూడాల్సిందే.













