ఆచార్య, సిద్ధల రిలేషన్ ఏంటంటే..
చిరంజీవి, కొరటాల శివ కాంబో లో వస్తున్న ఆచార్య సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమా లో నటించడం వల్ల ప్రేక్షకుల్లో ఇంకా ఆసక్తి పెరుగుతుంది. మెగాస్టార్ చిరంజీవి మరియు చరణ్ లు కలిసి మొదటిసారి ఒక పూర్తి స్థాయి కాంబినేషన్ సీన్స్ చేయబోతున్నారు. ఈ సినిమాలో తండ్రి కొడుకుల మధ్య వచ్చే సీన్స్ ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉంటాయంటున్నారు. ఇద్దరూ నక్సలైట్లుగా కనిపిస్తారని మొదటి నుంచి వార్తలొస్తాయి. కానీ తాజాగా ఇంకొక కొత్త వార్త పుట్టుకొచ్చింది.
నక్సల్స్ ఉద్యమంలో ఉండే చిరూని ఒకానొక టైమ్ లో అనూహ్యంగా పోలీసులు చుట్టుముడతారు. ఆ సమయంలో పోలీసుల్లో ఒక్కడైన సిద్ధ కావాలని చిరూని కాపాడతాడు. చిరూ వల్లే చదువుకున్న సిద్ధ ఆయన్ను కాపాడటంతో పాటూ, ఆయన దారిలో నడిచేందుకు సిద్ధమవుతాడట. అలా సిద్ధ మరియు ఆచార్యలు కలిసి ఉద్యమంలో ముందుకు సాగుతారట. ఇది ఎంత వరకు నిజమో తెలీదు. కొరటాల శివ ఈ స్టోరీని చాలా అద్భుతంగా మలిచాడని, ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.













