సిరివెన్నెల సీతారామశాస్త్రికి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు
సీనియర్ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రికి పద్మశ్రీ అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. శుభాకాంక్షలు తెలియజేసేందుకు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సిరివెన్నెల ఇంటికి వెళ్లి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆ సందర్భంలో సిరివెన్నెల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. చిరంజీవి అంతటి వారు పిలవాలే కానీ సిరివెన్నెల తనకు తానుగానే ఆయన ఇంటికి వెళ్లి ఉండేవారు. కానీ అది సంస్కారం కాదని చిరంజీవి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లారంటూ మెగాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.













