Chiranjeevi: సినిమా పరిశ్రమకు ఒకే చిత్రం తో ఇద్దరం పరిచయం అయ్యాం! ‘కోట’ మరణంపై చిరంజీవి దిగ్భ్రాంతి

లెజెండరీ నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) మరణంపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) స్పందించారు. “ప్రాణం ఖరీదు” చిత్రం ద్వారా కోటతో కలిసి సినిమా రంగంలోకి ప్రవేశించానని గుర్తుచేసుకున్నారు. కామెడీ, విలన్, సపోర్టింగ్ క్యారెక్టర్ అనే తేడా లేకుండా ఆయన చేసిన ప్రతి పాత్ర తనదైన శైలిలో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిందన్నారు. ఇటీవల కుటుంబంలో జరిగిన వ్యక్తిగత విషాదం ఆయనను తీవ్రంగా ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. “కోట గారి లాంటి గొప్ప నటుడి మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు” అంటూ, కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు మరణంతో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో కూరుకుపోయింది. కొన్ని వందల సినిమాల్లో నటించి ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన ఆయన ఇక లేరని తెలిసి సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి చెందుతున్నారు. కోట లాంటి మహానటుడు సినీ ఇండస్ట్రీలో మరొకరు లేరని.. ఆయన లాంటివారు మళ్లీ రారని కొనియాడుతున్నారు. ఆయన మరణవార్త తెలియగానే సినీ, రాజకీయ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. సీనియర్ హీరో చిరంజీవి కూడా కోట మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఆయనతో తనకున్న బంధాన్ని తలుచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.