మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఇద్దరు మెగాస్టార్ లు
బాలీవుడ్ మరియు టాలీవుడ్ మెగాస్టార్ లు అమితాబ్, చిరంజీవి ల మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పే పన్లేదు. వీరిద్దరూ కలిసి రీసెంట్ గా సైరా సినిమాలో కనిపించారు. చిరంజీవి కోరిక మేరకు బిగ్ బి కనిపించి సినిమా స్థాయిని పెంచాడు అనడంలో సందేహం లేదు. అంతకుముందు కూడా చిరూ, అమితాబ్ లు కలిసి వేదికను షేర్ చేసుకున్నారు. వీరిద్దరి సన్నిహిత్యంతో మరో అడుగు అన్నట్లుగా మళ్లీ మరొకసారి వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.
బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం హిందీలో అమితాబ్ చేయబోతున్న ఒక సినిమాలో కీలకపాత్ర కోసం చిరంజీవి ను సంప్రదించినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయట. స్వయంగా అమితాబ్, చిరూకు ఫోన్ చేసి తన సినిమాలో ఆ రోల్ చేయమని చిరంజీవిని అడిగినట్లు.. వెంటనే ఆ ప్రపోజల్ కు చిరూ ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఇది కేవలం గెస్ట్ రోల్ లా మాత్రం ఉండదట. ఫుల్ లెంగ్త్ రోల్ లోనే చిరూ ఆ సినిమాలో కనిపించబోతున్నట్లు చెప్తున్నారు. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలీదు కానీ ఈ న్యూస్ తో అటు మెగా ఫ్యాన్స్ తో పాటూ, అన్నీ వర్గాల ప్రేక్షకుల్లో కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. దీనిపై ఏ విషయం క్లారిటీ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.













