Jailer2: జైలర్2లో చిరూ క్యామియో?
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dileep Kumar) దర్శకత్వంలో జైలర్(Jailer) కు సీక్వెల్ గా జైలర్2 కు ప్లాన్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జైలర్2(Jailer2) ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. నెక్ట్స్ ఇయర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. ప్రస్తుతం కూలీ షూటింగ్ లో బిజీగా ఉన్న రజినీకాంత్ ఆ తర్వాత ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.
జైలర్2ని నెల్సన్ జైలర్ ను మించేలా భారీగా ప్లాన్ చేస్తున్నాడు. జైలర్ లో స్టార్ హీరోలైన మోహన్ లాల్(Mohanlal), శివరాజ్ కుమార్(Sivaraj Kumar), జాకీ ష్రాఫ్(Jockey Shraf) క్యామియోలు ఎంత హైలైట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలో వారు కనిపించేది కాసేపే అయినా థియేటర్లలో మాత్రం వారి పాత్రలు వచ్చినప్పుడు అందరికీ విజిల్స్ వేయించాయి.
ఇప్పుడు జైలర్2లో ఆ పాత్రలు కంటిన్యూ అవుతాయా లేదా అన్నది పక్కన పెడితే నెల్సన్ మరికొన్ని కొత్త పాత్రలను యాడ్ చేస్తున్నాడట. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) జైలర్2లో గెస్ట్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. జైలర్2లో చిరూ ఎంట్రీ మంచి యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే రజినీ(Rajini)- చిరూ(Chiru)ని ఒకే ఫ్రేమ్ లో చూసే అవకాశముంటుంది. గెస్టు పాత్రలకు చిరంజీవి ఎప్పుడూ నో చెప్పడు. పైగా రజినీతో ఆయనకు మంచి స్నేహముంది కాబట్టి ఈ వార్త నిజమయ్యే అవకాశాలు ఎక్కువే.













