మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సాంగ్ ట్రెయిలర్, ఆడియో రిలీజ్
పద్మ విభూషణ్ మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా మెగా అభిమానులు జరుపుకుంటారు.ప్రతి సం|| మెగా వారోత్సవాలు పేరిట జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే.
అలాగే ఈ సంవత్సరం కూడా దేశ విదేశాలలోను సైతం మెగా అభిమానులు శ్రీ చిరంజీవి గారి జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అఖిల భారత చిరంజీవి యువత, చిరంజీవి చారిటబుల్ ట్రస్టు, ప్రగతి నగర్ మెగా అభిమానులు నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో భాగంగా.. ప్రముఖ సినీ కళాకారులు నాగ మహేష్, శుభోదయం సుబ్బారావు, నూకరాజు, నండూరి రాము, కందుల శివ, బేబీ హాసిని నటించిన మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టిన రోజు సాంగ్ ట్రెయిలర్, ఆడియోని సురేష్ కొండేటి లాంచ్ చేయడం జరిగింది.













