చిరూ చీఫ్ గెస్టుగా రావడానికి కారణమిదే!
భీష్మ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన దర్శకుడైనప్పటికీ వెంకీ కుడుముల కొత్త సినిమా మొదలవడానికి మూడేళ్లు పట్టింది. ఇప్పుడు మళ్లీ భీష్మ కాంబినేషన్‌ని రిపీట్ చేస్తూ, నితిన్ రష్మిక జోడీగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. హైదారబాద్‌లో ఈ సినిమా గ్రాండ్‌గా లాంఛ్ అయింది. ఈ సినిమా ఓపెనింగ్‌కు మెగాస్టార్ చిరూ చీఫ్ గెస్టుగా వచ్చారు. వాస్తవానికి భీష్మ తర్వాత వెంకీ, చిరూకు ఓ స్టోరీ చెప్పాడు. డీవీవీ దానయ్య నిర్మాణంలో సినిమాను కూడా అనౌన్స్ చేశారు. కానీ స్టోరీ విషయంలో కొంత భిన్నాభిప్రాయం ఉండటంతో దాన్ని క్యాన్సిల్ చేశారు. దీంతో వెంకీకి వెయిటింగ్ టైమ్ ఎక్కువైపోయింది. ఓ యంగ్ డైరెక్టర్ టైమ్‌ని చిరూ వేస్ట్ చేశారని అందరూ చిరూపై కామెంట్లు కూడా చేశారు.
అయితే దీని వెనుక మెగా వ్యూహం ఉందని టాక్ వినిపిస్తుంది. వాల్తేరు వీరయ్య షూటింగ్ టైమ్‌లో మైత్రీతో వెంకీని జట్టు కట్టించింది మెగాస్టారే చిరూనే అని, పాన్ ఇండియన్ ఫిల్మ్స్ మాత్రమే చేస్తున్న రష్మికకు ఎక్కువ పారితోషికం ఇచ్చేలా నిర్మాతలను ఒప్పించి, క్రేజ్ ఉన్న జీవీ ప్రకాష్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా సెట్ చేయడానికి, బడ్జెట్ విషయంలో రాజీ లేకుండా చేసింది కూడా చిరూనే అని టాక్ నడుస్తుంది.
ఈ రీజన్‌తోనే నితిన్ మార్కెట్ డౌన్లో ఉన్నప్పటికీ ఆ విషయాన్ని వదిలేసి ప్రొడ్యూసర్లు భారీగానే ఖర్చు పెట్టడానికి రెడీ అయినట్లు సమాచారం. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక వెంకీ మళ్లీ కొత్త కథతో చిరూని మెప్పిస్తే, చిరూతో సినిమా సెట్స్ కి వెళ్లే ఛాన్సుంది. ఎలాగూ భోళా శంకర్ తర్వాత చిరంజీవి మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది లేదు. వెంకీతో సినిమా విషయాన్ని పెండింగ్ లో మాత్రమే పెట్టారు కానీ పూర్తిగా క్యాన్సిల్ అయితే కాలేదని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి. వీటన్నింటినీ క్లియర్ చేయడానికే చిరంజీవి నితిన్-వెంకీ- రష్మిక సినిమా లాంఛ్ కు చీఫ్ గెస్టుగా వచ్చాడట.













