టాక్సీవాలాకు మెగాస్టార్ అభినందనలు
విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో రూపుదిద్దుకొన్న టాక్సీవాలా చిత్రం విజయం సాధించిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి యూనిట్ సభ్యుల్ని తన ఇంటికి పిలిపించుకొని అభినందనలు తెలిపారు. మెగా అభిమానిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి, జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, అనేక చిత్రాలకు పీఆర్వోగా పని చేసి, నిర్మాతగా టాక్సీవాలా చిత్రాన్ని నిర్మించి, విజయం సాధించి మెగాస్టార్ అభినందనలు అందుకోవడం తన జీవితంలో మరచిపోలేని రోజని నిర్మాత ఎస్.కె.ఎన్. ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రాహుల్ సంకృత్యన్, హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కూడా పాల్గొన్నారు.













