Mega157: ఘనంగా ప్రారంభమైన మెగా157
ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం(Sankrantiki Vasthunnam) సినిమాతో విక్టరీ వెంకటేష్(Venktatesh) తో కలిసి బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి(Anil Ravipudi) తన తర్వాతి సినిమాను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(megastar Chiranjeevi)తో చేయనున్న విషయం తెలిసిందే. మెగా157(Mega157) వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇవాళ ఉగాది సందర్భంగా ఘనంగా జరిగాయి.
ఈ పూజా కార్యక్రమానికి టాలీవుడ్ లోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారిలో చిత్ర నిర్మాతలు దిల్ రాజు(Dil Raju), నాగవంశీ(Naga vamsi), అల్లు అరవింద్(Allu Aravind), మైత్రీ నవీన్(Mythri Naveen), రవిశంకర్(Ravi Shankar), సురేష్ బాబు(Suresh Babu) తో పాటూ హీరో వెంకటేష్(Venkatesh) కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డైరెక్టర్లు రాఘవేంద్ర రావు(Raghavendra Rao), వంశీ పైడిపల్లి(Vamshi Paidipally), శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela), వశిష్ఠ(Vasishta), బాబీ(Bobby) హాజరయ్యారు.
దిల్ రాజు, శిరీష్(Sirish) కలిసి సినిమా స్క్రిప్ట్ ను నిర్మాతలైన సాహు గారపాటి(Sahu Garapati), సుస్మిత(Sushmitha)కు అందించగా రాఘవేంద్ర రావు, అల్లు అరవింద్ కలిసి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. విక్టరీ వెంకటేష్ ఈ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టి మెగా 157ను ప్రారంభించారు. అనంతరం మెగా157 టీమ్ తో వచ్చిన అతిథులంతా కలిసి ఫోటోలు దిగారు. మొత్తానికి ఎంతో ఘనంగా మెగా157 ప్రారంభమైంది.













