అల్లురి సీతారామరాజుగా మెగాస్టార్ ?
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూట్ చేస్తున్న సన్నివేశాలు చాలా ఎమోషనల్‌గా, సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయని తెలిసింది. సైరాలో చిరంజీవి అల్లూరి సీతారామరాజు గెటప్‌లో కూడ కన్పించనున్నారని తెలిసింది. నరసింహారెడ్డిని బ్రిటీషు సైన్యం ఉరి తీసిన తర్వాత, తదుపరి నరసింహారెడ్డి స్ఫూర్తితో మళ్లీ బ్రిటీషు సైన్యంపై తిరుగుబాటు చేసిన కొంతమంది విప్లవకారులను చూపించనున్నారని తెలిసింది. ఆ విప్లవకారుల గెటప్స్‌లో కూడా మెగాస్టార్ కన్పించనున్నారని టాక్. అల్లూరి గెటప్లోకూడా చిరంజీవి కన్పించనున్నారు. నయనతార హీరోయిన్గా నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో హీరో రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.













