షూటింగ్ పార్ట్ పూర్తీ చేస్తున్న’ఆచార్య’ టీం.. ఈ దీపావళి కి విడుదల సన్నాహాలు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’ మూవీ పెండింగ్ పనులు పూర్తి చేస్తున్నారట. ఇటీవలే టాకీ పార్టు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో కేవలం రెండు పాటలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సాంగ్స్ షూట్లో రామ్ చరణ్, చిరంజీవి పాల్గొంటున్నారని తెలుస్తోంది. మిగిలిన రెండు పాటల షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారట. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా ‘ఆచార్య’. భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తూనే ఓ ముఖ్యమైన పాత్ర చేస్తున్నాడుహైదరాబాద్లో వేసిన ఓ స్పెషల్ సెట్లో ‘ఆచార్య’ షూటింగ్ తిరిగి ప్రారంభించారు. చిరంజీవి- రామ్ చరణ్ కాంబినేషన్లో ఓ పాట షూట్ చేస్తున్నారట. వారం రోజుల పాటు ఈ పాట చిత్రీకరణ జరగనుందట. ఆ వెంటనే రామ్ చరణ్- పూజా హెగ్డే కాంబోలో మరో డ్యూయెట్ సాంగ్ చేయనున్నారట.
ఇప్పటికే ‘లాహే లాహే’ సాంగ్ ప్రేక్షకుల మనసు దోచుకోగా.. ఈ రెండు పాటలు అంతకుమించి ఉంటాయని తెలుస్తోంది. రెజీనా ఐటమ్ సాంగ్ కూడా మాస్ ఆడియన్స్కి ఊపు తెప్పించనుందని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్లుగా కాజల్ అగర్వాల్, పూజా హెగ్డేలు నటిస్తున్నారు. సోనూసూద్, జిషు షేన్ గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. సిద్ద పాత్రలో రామ్ చరణ్ రోల్ కూడా స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని టాక్. నక్సల్స్ బ్యాక్ డ్రాప్తో ఎక్కడా తగ్గకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ జోడిస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు కొరటాల. ఈ దీపావళికి విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.













