Chiranjeevi: చిరంజీవి తల్లి తనను గుర్తు పట్టలేదట!
రీసెంట్ గా మహిళా దినోత్సవ సందర్భంగా మెగా ఫ్యామిలీ నుంచి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ రిలీజైన విషయం తెలిసిందే. ఇందులో మెగాస్టార్ తల్లి, చెల్లెల్లతో పాటూ తమ్ముడు నాగబాబు(naga babu) కూడా పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో మెగా ఫ్యామిలీ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టింది. ఫ్యామిలీలో అందరికంటే తానే ఎక్కువ యాక్టివ్ అని చెప్పిన చిరూ, తన మూడేళ్ల వయసులో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నాడు.
ఇంట్లో నుంచి ఆడుకోవడానికి రోడ్డు మీదకు వెళ్లి, తిరిగి ఎటు రావాలో అర్థం కాక రోడ్ మీదే కూర్చున్నాడట చిరూ(Chiru). అప్పుడు ఒకతను తనను చూసి కొలిమిలోకి తీసుకెళ్లి, తన ఇంట్లోని వారికి కబురు పంపారని, తన తల్లి వచ్చేసరికి ఒంటినిండా మసి పూసుకుని ఉండటంతో తనను గుర్తు పట్టలేకపోయి, వీడు మా అబ్బాయి కాదని చెప్పిందన్నాడు చిరూ.
తన తల్లి ఇంటికెళ్లబోతూ ఏదో అనుమానంతో మళ్లీ వెనక్కి తిరిగి చూసి తనను గుర్తు పట్టి ఇంటికి తీసుకెళ్లిందని, ఆ తర్వాత తనను తాళ్లతో కట్టేసిందని, తన గొడవను అమ్మ అల్లరిగా భావించేదని చిరూ తెలిపాడు. ఇప్పుడైతే తన తల్లికి ఐదుగురు సంతానం ఉన్నామని, కానీ ఆమెకు మరో ముగ్గురు బిడ్డలున్నారని, చిన్న వయసులోనే వాళ్లు చనిపోయారని చిరూ తెలిపాడు.













