పోలీసులు నిహారికకు సంబంధించినంత వరకు క్లియర్ అన్నారన్న మెగా బ్రదర్ : ఖండించిన గల్లా అశోక్ ఫ్యామిలీ : కేసులో నన్నెందుకు లాగుతున్నారు? హేమ ఆవేదన
హైదరాబాద్ రేవ్ పార్టీ ఇష్యూలో పలువురు సెలబ్రిటీల పేర్లు బయటకు వస్తుండటం సంచలనంగా మారింది. శనివారం అర్దరాత్రి దాటాక అంటే ఆదివారం తెల్లవారు ఝామున మూడు గంటల ప్రాంతంలో రాడిసన్ బ్లూ హోటల్లో జరిపిన దాడుల్లో ప్రముఖులు పట్టుబడ్డారు. ఇందులో ప్రముఖంగా గల్లా అశోక్ పేరు వినిపించింది.హైద్రాబాద్‌లో రేవ్ పార్టీల కల్చర్ హద్దులు దాటుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం తెల్లవారు ఝామున మూడు గంటల ప్రాంతంలో రాడిసన్ బ్లూ హోటల్లో జరిపిన దాడుల్లో ప్రముఖులు పట్టుబడ్డారు. దాదాపు 150 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. చివరకు ఐదుగురిని మాత్రం విచారించారు. ఆ ఐదుగురి వద్దే డ్రగ్స్‌కు సంబంధించిన ఆనవాళ్లు దొరికాయని సమాచారం. ఆ ఐదుగురిలో నిహారిక, రాహుల్ సిప్లిగంజ్ వంటి వారున్నారని తెలుస్తోంది.
అయితే ఇందులో ఉన్నతాధికారుల పిల్లలు, రాజకీయ ప్రముఖుల వారసులు కూడా ఉన్నారని సమాచారం అందుతోంది. ఈ క్రమంలో గల్లా అశోక్ పేరు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. దీంతో వెంటనే గల్లా ఫ్యామిలీ నివారణ చర్యలు ప్రారంభించింది.రేవ్ పార్టీ కేసులో గల్లా అశోక్ పేరు వినిపించడంతో ఫ్యామిలీ మొత్తం అప్రమత్తమైంది. వెంటనే వాటిని ఖండించేసింది. అవన్నీ తప్పుడు వార్తలని కొట్టి పారేశారు. ఈ మేరకు పీఆర్వో ద్వారా ఓ నోట్ కూడా విడుదల చేయించారు.
‘నిన్న రాత్రి హైదరాబాద్ లోని ఓ పబ్ పై పోలీసులు జరిపిన రైడ్ లో గల్లా అశోక్ పేరు కూడా జత చేసి కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో గల్లా అశోక్ కి ఎలాంటి సంబంధం లేదు. దయచేసి ఇలాంటి నిరాధారమైన వార్తలని మీడియాలో ప్రసారం చెయ్యొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని గల్లా ఫ్యామిలీ చెప్పుకొచ్చింది. మొత్తానికి ఈ వ్యవహారంతో మరోసారి డ్రగ్స్ కేసు వార్తల్లోకి వచ్చింది. హైద్రాబాద్‌లో డ్రగ్స్ వాడకం ఎలా పెరిగిందో అందరికీ మరో సారి తెలిసి వచ్చింది. దీంతో పాత కేసులో కూడా ఏమైనా కదలిక వస్తుందేమో చూడాలి. గల్లా అశోక్ ఈ సంక్రాంతికి హీరో అనే సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలో హేమ కూడా ఉందంటూ వార్తలు వస్తుండటంపై స్వయంగా ఆమె రియాక్ట్ అయింది.
హైదరాబాద్‌లో తాజాగా బయటపడిన డ్రగ్స్ వ్యవహారం జనాల్లో హాట్ టాపిక్ అయింది. బడా బాబుల పిల్లలు రాత్రి వేళల్లో పబ్బుల్లో ఎంజాయ్ చేస్తూ డ్రగ్స్ మత్తులో ఊగిపోతున్నారని తెలిసేలా తాజాగా చోటుచేసుకున్న బంజారా హిల్స్ రేవ్ పార్టీ వ్యవహారం మరోసారి స్పష్టం చేసింది. దీంతో ఈ ఇష్యూ జనాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ రేవ్ పార్టీలో ఎవరెవరు ఉన్నారు? సినీ సెలబ్రిటీలు ఎంతమంది అనేదానిపై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నటి హేమ పేరు బాటకు రావడంతో వెంటనే ఆమె రియాక్ట్ అయింది. శనివారం అర్దరాత్రి దాటాక అంటే ఆదివారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో బంజారా హిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు జరిపారు. ఈ పార్టీలో విచ్చలవిడిగా డ్రగ్స్ వాడుతున్నారని పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. ఒక్కసారిగా పబ్‌ని చుట్టుముట్టి దాదాపు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో మెగా డాటర్ నిహారిక, బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సింప్లిగంజ్ కూడా ఉండటంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది.
ఈ వ్యవహారంలో ఇంకొంతమంది సెలబ్రిటీలు చిక్కున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే గల్లా అశోక్ పేరు ప్రచారంలోకి రావడంతో గల్లా ఫ్యామిలీ వెంటనే రియాక్ట్ అయి సదరు వార్తలను ఖండించింది. మరోవైపు ఇదే పబ్ ఇష్యూలో నటి హేమ పేరు కూడా చెక్కర్లు కొడుతుండటంతో ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసుతో తనకెలాంటి సంబంధం లేకపోయినప్పటికీ అనవసరంగా తన పేరును లాగుతున్నారని చెప్పింది. ఈ మేరకు తనపై తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై ఫిర్యాదు చేస్తున్నట్టు హేమ చెప్పింది. అసలు తాను పబ్‌కే వెళ్లలేదని, తనను బద్నాం చేసేందుకే ఇలా చేస్తున్నారని ఆమె వాపోయింది.
మెగా ఫ్యామిలీకి చెందిన నిహారిక పట్టుబడటంపై సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై నిహారిక తండ్రి నాగబాబు వీడియో బైట్ ద్వారా వివరణ ఇచ్చారు. ‘‘గత రాత్రి రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన ఘటనపై నేను స్పందించడానికి కారణం నా కూతురు నిహారిక ఆ సమయానికి అక్కడ ఉండటమే. పబ్ టైమింగ్‌ను పరిమితికి మించి నడపటం వల్ల పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. నిహారికకు సంబంధించినంత వరకు తను చాలా క్లియర్. ఇక్కడ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు నిహారిక విషయంలో ఎలా తప్పు లేదని చెప్పారు. సోషల్, మెయిన్ స్ట్రీమ్ మీడియాల్లో ఎలాంటి అనవసరమైన పుకార్లకు తావు ఇవ్వకూడదని నేను వీడియో రిలీజ్ చేస్తున్నాను. దయచేసి అనవసరమైన పుకార్లను పుట్టించవద్దని నా మనవి’’ అని తెలిపారు నాగబాబు.













