NTR Raju:ఎన్టీఆర్ రాజు చిత్రపటానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
తిరుపతిలోని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వీరాభిమాని ఎన్టీఆర్ రాజు ఇటీవలె కాలం చేయడం జరిగింది. వారి మరణానికి నాడు సంతాపం తెలిపిన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు నేడు తిరుపతిలోని ఎన్టీఆర్ రాజు గారి నివాసానికి విచ్చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుమారుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ గారిని, వారి కుటుంబ సభ్యులను వారితో కాస్త సమయం గడిపి పరామర్శించారు. స్వర్గీయ ఎన్టీఆర్ వీరాభిమాని అయిన ఎన్టీఆర్ రాజుగారు వంటి వ్యక్తిని కోల్పోవడం అనేది నారా, నందమూరి కుటుంబాలకు తీరని లోటని తెలిపారు. ఎన్టీఆర్ రాజుగారు మా కుటుంబ సభ్యుడు వంటి వారు, అటువంటి వ్యక్తి ఇకలేరు అనేది మాకు ఎంతో బాధని కలిగిస్తుంది అని నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, పులివర్తి నాని, సునీల్, శాప్ చైర్మన్ రవి నాయుడు, తాతాయిగుంట గ్రామ చైర్మన్ మహేష్ యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆర్ సి మణి కృష్ణ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ రాజు మరణం వారి కుటుంబానికి కాదు, తెలుగుదేశం పార్టీకి కూడా తీరని లోటుగా వారంతా తెలిపారు. అటువంటి వ్యక్తిని నష్టపోవడం వారికి ఎంతో బాధనిచ్చిందని తెలిపారు.
*ఎన్టీఆర్ వీరాభిమాని, టిటిడి ఎక్స్ బోర్డు మెంబర్ ఎన్టీఆర్ రాజు చిత్రపటానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు*
తిరుపతిలోని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వీరాభిమాని, టిటిడి ఎక్స్ బోర్డు మెంబర్ ఎన్టీఆర్ రాజు ఇటీవలె కాలం చేయడం జరిగింది. వారి మరణానికి నాడు సంతాపం తెలిపిన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు నేడు తిరుపతిలోని ఎన్టీఆర్ రాజు గారి నివాసానికి విచ్చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుమారుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ గారిని, వారి కుటుంబ సభ్యులను వారితో కాస్త సమయం గడిపి పరామర్శించారు. స్వర్గీయ ఎన్టీఆర్ వీరాభిమాని అయిన ఎన్టీఆర్ రాజుగారు వంటి వ్యక్తిని కోల్పోవడం అనేది నారా, నందమూరి కుటుంబాలకు తీరని లోటని తెలిపారు. ఎన్టీఆర్ రాజుగారు మా కుటుంబ సభ్యుడు వంటి వారు, అటువంటి వ్యక్తి ఇకలేరు అనేది మాకు ఎంతో బాధని కలిగిస్తుంది అని నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు.