Chhorii2: వణుకు పుట్టిస్తున్న ఛోరీ2 టీజర్
హార్రర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే మూవీస్ ఈ మధ్య ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో వచ్చే సినిమాలను చూడ్డానికి ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఓటీటీలు కూడా అలాంటి కంటెంట్ ఉన్న మూవీస్, వెబ్ సిరీస్లను నిర్మించడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.
ఇక అసలు విషయానికొస్తే నుస్రత్ భరూచా ప్రధాన పాత్రలో వస్తోన్న మూవీ ఛోరీ2 (Chhorii2). సామాజిక దురాచారాల నుంచి, అతీంద్రియ శక్తుల నుంచి తన కూతుర్ని కాపాడుకోవడానికి ఓ తల్లి చేసే పోరాట కథగా రిలీజైన ఛోరీ మూవీకి ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. ఛోరీ మూవీకి విమర్శకుల ప్రశంసలు కూడా రావడంతో దానికి సీక్వెల్ గా వస్తోన్న ఛోరీ2 పై అందరికీ మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.
విశాల్ ప్యూరియా దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ ఏప్రిల్ 11 నుంచి ప్రైమ్ వీడియో(Prime Video) లో అందుబాటులోకి రానున్నట్టు మేకర్స్ ఆల్రెడీ అనౌన్స్ చేస్తూ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ చూస్తుంటే మొదటి భాగం పార్ట్ కంటే మరింత భయంకరంగా ఉంది. టీజరే ఇంత భయంకరంగా ఉంటే మరి సినిమా ఇంకెంత వణుకు పుట్టిస్తుందో అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.













