‘చేరువైన దూరమైన’ ట్రైలర్ లాంఛ్ చేసిన అనిల్ రావిపూడి
సుజిత్ రెడ్డి, తరుణి సంగ్ జంటగా వినాయక ఎంటర్టైన్మెంట్ పతాకంపై చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో కంచర్ల సత్యనారాయణ రెడ్డి, సముద్రాల మహేష్ గౌడ్ కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం చేరువైన.. దూరమైన. సుకుమార్ పమ్మి సంగీతం అందించారు. ఈ చిత్రం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరై చిత్ర ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ హీరో సుజిత్‌కి మంచి భవిష్యత్ ఉంది. తప్పకుండా ఈ చిత్రం హిట్ అవుతుంది అన్నారు. దర్శకుడు చంద్రశేఖర్ కానూరి మాట్లాడుతూ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లు సుజిత్, తరుణి సింగ్ చాలా బాగా నటించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రం ఇది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో హీరోయిన్లు సుజిత్, తరుణి సింగ్, నిర్మాత కంచర్ల సత్యనారాయణ రెడ్డి, కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి, శశి, రచయిత సురేష్, బట్టు అంజిరెడ్డి, సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.













