చరణ్ లో మూడు షేడ్స్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా రిలీజవుతుందని నిర్మాత దిల్ రాజు చెప్పినప్పటి నుంచి ఫ్యాన్స్ డిసెంబర్ కోసం ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ నుంచి ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టాలని చూస్తుంది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ కు సంబంధించిన కొన్ని లీకులు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
అందులో ముఖ్యమైంది చరణ్ ట్రిపుల్ రోల్ చేస్తున్నాడనే వార్త. ఇప్పటివరకు చరణ్ ద్విపాత్రాభినయం చేశాడు కానీ మూడు క్యారెక్టర్లలో కనిపించింది మాత్రం లేఉద. అయితే ఈ సినిమాలో చరణ్ ట్రిపుల్ రోల్ చేస్తున్నాడనేది నిజం కాదు. దీనివెనుక కథ వేరే ఉంది. చరణ్ ఈ సినిమాలో మూడు షేడ్స్ లో కనిపించనున్నాడనేది నిజమే.
కానీ చరణ్ చేస్తున్న పాత్రలు మాత్రం రెండే. అందులో ఒకటి రాజకీయ నాయకుడిగా అంజలి భర్తగా కనిపిస్తాడు. రెండోది కొడుకు పాత్రలో కాలేజీ చదువుకు సంబంధించి కొంత భాగం, ఆ తర్వాత ఐఏఎస్ గా మరికొంత భాగం కనిపించనున్నాడు. అంటే తండ్రి పాత్రలో ఒక షేడ్, స్టూడెంట్ గా మరో షేడ్, కలెక్టర్ అయ్యాక ఇంకో షేడ్ ఇలా మొత్తం మూడు రకాలుగా చరణ్ కనిపించనున్నాడన్నమాట. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ఓ సాంగ్ రిలీజ్ కాగా, ఈ నెలాఖరుకి సెకండ్ సాంగ్ రిలీజ్ చేయాలని మేకర్స్ చూస్తున్నారట.













