సైలెంటుగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న తెలుగు డైరెక్టర్
ఎంతోమంది టాలీవుడ్ డైరెక్టర్లు ఇక్కడ మంచి పేరు సంపాదించి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంటారు. కానీ ఇప్పుడు ఓ డైరెక్టర్ మాత్రం సైలెంట్ గా నేరుగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అతను మరెవరో కాదు చరణ్ తేజ్ ఉప్పలపాటి. నిఖిల్ స్పై మూవీకి నిర్మాతల్లో ఒకడిగా వ్యవహరించాడు చరణ్ తేజ్. సినిమా పోస్టర్ లో సీఈఓగా పేరుంటుంది.
ఇప్పుడీ చరణ్ తేజ్ చాలా పెద్ద సినిమాతో బాలీవుడ్ లో డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాలో కాజోల్ లీడ్ రోల్ లో నటిస్తుంది. కాజోల్ కు జోడీగా ప్రభుదేవా నటిస్తున్నాడు. టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ ఈ సినిమాతోనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇంకా నసీరుద్దీన్ షా లాంటి లెజెండరీ నటుడు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు జీకే విష్ణు కెమెరామెన్ గా పని చేస్తున్నాడు. టాలీవుడ్ లో సినిమాలేమీ చేయని కుర్రాడికి ఇప్పుడు బాలీవుడ్ లో నేరుగా ఛాన్స్ రావడం, అందులో పేరున్న నటీనటులు ముఖ్యపాత్రలు పోషించడం విశేషమే. ఈ సినిమాను చరణ్ తేజ్ సొంతంగా ప్రొడ్యూస్ చేస్తుండొచ్చు. మరి బాలీవుడ్ లో చరణ్ తేజ్ ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి.













