రంగస్థలం సీక్వెల్ వద్దంటున్న చరణ్ ఫ్యాన్స్
ఒక హీరో, డైరక్టర్ కలిసి ఏదైనా బ్లాక్ బస్టర్ సినిమా తీశారంటే, ఆ తర్వాతి నుంచి వాళ్లను స్టార్ హీరో, స్టార్ డైరక్టర్లుగా పిలుస్తుంటారు ఫ్యాన్స్. టాలీవుడ్ లో అలాంటి స్టార్ డమ్ అందుకున్న కాంబినేషన్స్ చాలానే ఉన్నాయి. అందులో ఒకటి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్.
వీరిద్దరూ కలిసి చేసిన సినిమా రంగస్థలం. ఈ సినిమాతో రామ్ చరణ్ నెక్ట్స్ లెవల్ కి వెళ్లాడు. అలాగే సుకుమార్ కూడా రియలిస్టిక్ ఫిల్మ్స్ ను తీయగలడని ప్రూవ్ చేసుకున్నాడు. అయితే ఇప్పుడు వీరిద్దరి కాంబోలో మళ్లీ సినిమా ఎప్పుడొస్తుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ వరకు బానే ఉంది కానీ వీరిద్దరూ కలిసి ఇప్పుడు రంగస్థలం సినిమాకు సీక్వెల్ తీయనున్నారనే పుకార్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఈ వార్లల్లో ఎంతవరకు నిజముందో తెలీదు కానీ నిజానికి రంగస్థలం అనే సినిమాకు కాస్టింగ్ నుంచి టెక్నీషియన్లు, కథ అన్నీ బాగా కుదిరాయి. ఇప్పుడు మళ్లీ అలానే ప్లాన్ చేస్తే అది మళ్లీ సక్సెస్ అవుతుందని చెప్పలేం. ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన రంగస్థలం ను కదిలించకుండా ఉండాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆ సినిమాకు సీక్వెల్ కాకుండా ఏదైనా సరే ఫర్లేదు అనుకుంటున్నారు అభిమానులు. ప్రస్తుతం సుకుమార్ పుష్పతో బిజీగా ఉంటే, రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తో బిజీగా ఉన్నాడు. వీరిద్దరి కాంబోలో సినిమా రావాలంటే చాలానే టైమ్ పట్టే ఛాన్సుంది.













