చైతూ, చందూ ఇంట్రెస్టింగ్ స్టోరీ
థాంక్యూ, కస్టడీ సినిమాలతో ఘోర పరాజయాన్ని అందుకున్న నాగ చైతన్య తన తర్వాతి సినిమాల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఎంతో ఆలోచించి తన నెక్ట్స్ సినిమాను చందూ మొండేటితో చేయాలని నిర్ణయించుకున్నాడు చైతూ. భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమా గురించి ఇప్పుడు నెట్టింట ఓ వార్త వినిపిస్తోంది.
శ్రీకాకుళం నుంచి పాకిస్తాన్ తీరం వరకు సంబంధం ఉండే ఒక పెద్ద స్పాన్ ఉన్న అంశాన్ని సినిమాలో మెయిన్ కథగా తీసుకున్నాడట చందూ. ఈ సినిమా చైతూ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్తో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చందూ మొండేటి కార్తికేయ2 సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో భారీ హిట్ ను అందుకున్నాడు.
చందూ ఇప్పుడు ఈ సినిమాను కూడా అదే రేంజ్లో ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. కానీ ప్రస్తుతం చైతూ మార్కెట్ చాలా డల్ గా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో వరుస డిజాస్టర్లు అందుకున్న చైతూ, పాన్ ఇండియన్ లెవల్ లో క్రేజ్ దక్కించుకున్న చందూ మొండేటి కాంబోలో రానున్న సినిమాకు స్టోరీ లైన్తోనే మంచి హైప్ క్రియేట్ చేసేలా ఉన్నారు.













