చంద్రోదయం చిత్రీకరణ పూర్తి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయోపిక్‌గా రూపుదిద్దుకొంటున్న చంద్రోదయం షూటింగ్ పూర్తియింది. పి.వెంకటరమణ దర్శకత్వంలో జి.జె. రాజేంద్ర ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయంలో చంద్రబాబును యూనిట్ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఆకులు ఎన్ని కాల్సినా బొగ్గులు కావు బ్రదర్.. జిత్తులమారి నక్కులు, తోడేళ్లు ఎన్ని ఏకమైనా అడవికి రాజు.. మృగరాజు నా అల్లుడే అని ఎన్టీఆర్ పాత్ర చెప్పే డైలాగ్‌తో షూటింగ్ పార్ట్ పూర్తయింది. దేశచరిత్ర లోనే ఆదర్శవంతమైన నాయకుడు చంద్రబాబుగారే. ఆయన జీవితం అందరికి తెలియాని ఈ బయోపిక్ నిర్మిస్తున్నాం అని తెలిపారు. నవంబర్ రెండో వారంలో పాటలను, సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. వినోద్ నువ్వుల ఈ సినిమలో చంద్రబాబు పాత్ర పొషిస్తున్నారు.













