మార్చి 10న చంద్రోదయం విడుదల
తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవితం, రాజకీయ చరిత్ర ఇతివృత్తంతో నిర్మిస్తున్న చంద్రోదయం చిత్రాన్ని మార్చి 10న రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత జి.వి.కె. రాజేంద్ర తెలిపారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ మోహన్ శ్రీజ సినిమాస్ శ్వేతార్క గణపతి ఎంటర్‌ప్రైజస్ పతాకంలో రూపొందిన ఈ చిత్రాన్ని 2016 ఆగస్టులో నారావారి పల్లెలో ప్రారంభించామన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై దాదాపు 45 రోజుల పాటు నారా వారిపల్లెలో షూటింగ్ నిర్వహించినట్లు తెలిపారు. కథ, మాటలు, దర్శకత్వం పసుపులేటి వెంకటరమణ వహించినట్లు వివరించారు.













