చంద్రబాబు బయోపిక్ ఫస్ట్ లుక్ విడుదల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవిత కథతో తెరకెక్కుతున్న చిత్రం చంద్రోదయం. వినోద్ నువ్వుల చంద్రబాబు నాయుడు పాత్ర పోషిస్తున్నారు. పి.వెంకటరమణ దర్శకత్వంలో జి.జె.వి.కె.రాజేంద్ర నిర్మిస్తున్నారు. హీరో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ సామాన్య కుటుంబలో పుట్టి ఆదర్శ నాయకుడిగా ఎదిగిన చంద్రబాబు నాయుడు జీవితం గురించి అందరికీ తెలియచెప్పాలనే సంకల్పంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం అని తెలిపారు. చిత్రీకరణ పూర్తియింది. నారావారిపల్లె, తిరుపతి, హైదరాబాద్, అమరావతి వంటి ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. ఆక్టోబరులో పాటలను, ఆ తర్వాత చిత్రాన్ని విడుదల చేస్తాం అని నిర్మాత చెప్పారు.













