Chandra Babu Naidu: బాలయ్య లాంటి బావమరిది దొరకడం నా అదృష్టం: చంద్రబాబు
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)కు పద్మభూషణ్ పురస్కారం దక్కినందుకు తన చెల్లెలు నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari) బాలయ్యకు గ్రాండ్ గా పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి నందమూరి, నారా ఫ్యామిలీలు హాజరయ్యాయి. ఆ పార్టీలో బాలయ్య(Balayya)ను తన బావ చంద్రబాబు నాయుడు పొగడ్తలతో ముంచెత్తాడు.
బాలయ్య, భూ(Bhuvaneswari) వీరిద్దరూ ఎంతో పవర్ఫుల్ అని, వీరి మధ్య ఉండటం చాలా డేంజర్ అని, నిన్నటి వరకు అల్లరి బాలయ్యగా ఉన్న ఈయన ఇప్పుడు పద్మభూషణ్గా, దేశం గర్వించదగ్గ బిడ్డగా మారాడని, తమ కుటుంబంలో ఇలాంటి అవార్డు రావడం ఇదే ఫస్ట్ టైమ్ అని, కుటుంబం మొత్తం ఈ విషయంలో ఎంతో గర్వపడుతున్నట్లు బాబు తెలిపారు.
ఎవరైనా సరే ఒకే రంగంలో రాణిస్తుంటారు కానీ బాలయ్య మాత్రం వివిధ రంగాల్లో తన బాధ్యతను నిర్వర్తిస్తున్నాడని, బాలయ్య పైకి అల్లరిగా కనిపించినా, తనకు క్రమశిక్షణ, భక్తి ఎక్కువని, ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు క్యాన్సర్ హాస్పిటల్ బాధ్యతల్ని, ఇంకోవైపు రాజకీయాల్లో తన బాధ్యతను నిర్వర్తిస్తూ అన్నింటి మంచి పేరు తెచ్చుకున్నాడని చంద్రబాబు నాయుడు అన్నారు.
బాలయ్య ఎంతో మంచి మనిషని చెప్పిన బాబు, బాలయ్య లాంటి అద్భుతమైన బావమరిది దొరకడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. బాలయ్యపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పార్టీ మొత్తం మీద చంద్రబాబు, లోకేష్(Lokesh)బాలయ్యను పొగిడిన తీరు వల్ల వారిద్దరూ బాగా హైలైట్ అయ్యారు.













