తండేల్ రిలీజ్ డేట్ విషయంలో చందూ క్లారిటీ
తండేల్(Thandel) మూవీ రిలీజ్ అప్డేట్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్న అక్కినేని ఫ్యాన్స్ కు డైరెక్టర్ చందూ మొండేటి(Chandoo Mondeti) ఓ క్లారిటీ ఇచ్చేశాడు. ఓ సినీ వేడుకకు గెస్టుగా వచ్చిన చందూకి ఈ ప్రశ్న ఎదురవగా ఆయన సమాధానమిచ్చాడు. డిసెంబర్ నెలకు ఫస్ట్ కాపీ రెడీ చేయడం ఎట్టి పరిస్థితుల్లో కుదరని పని అని, అందుకే క్రిస్మస్ ఆప్షన్ పెట్టుకోలేదని క్లారిటీ ఇచ్చాడు.
అంతేకాదు తండేల్ సినిమా జనవరి నాటికి మొత్తం పూర్తవుతుందని, కానీ రామ్ చరణ్(Ram Charan) గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా కోసం అల్లు అరవింద్(Allu Aravind) ఆలోచించినా, మేనమామ వెంకటేష్(Venkatesh) మూవీ వస్తుందని చైతూ(Chaithu) ఆలోచించినా తండేల్ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవాల్సి ఉంటుందన్నాడు. ఆయన మాటల్ని బట్టి చూస్తుంటే తండేల్ రిలీజ్ డేట్ విషయంలో ఇంకా ఎలాంటి డెసిషన్ తీసుకోలేదని తెలుస్తోంది.
వాస్తవానికి తండేల్ సినిమాకు సంక్రాంతి చాలా బెస్ట్ ఆప్షన్. కానీ మేనల్లుడు రామ్ చరణ్ సినిమా పోటీలో ఉన్నప్పుడు తండేల్ సినిమాను అరవింద్ రిలీజ్ చేస్తాడా అనేది అసలు పాయింట్. అసలే తండేల్ సినిమాపై ఎంతో బడ్జెట్ పెట్టారు. చైతూ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు భారీ పోటీ మధ్య రిలీజ్ చేస్తే ఓపెనింగ్స్ పై ఆ ప్రభావం పడే ఛాన్సుంది. కాబట్టి తండేల్ కు సోలోగా రావడం చాలా అవసరం. మరి చివరకు తండేల్ టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.













