రష్మిక కు మెగాస్టార్ సినిమాలో ఛాన్స్
సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఇంత ముఖ్యమో, లక్ కూడా అంతే ముఖ్యం. రష్మిక ను చూస్తే అది నిజమే అనిపించక మానదు. టాలీవుడ్ లో చిన్న హీరో పక్కన హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక, చాలా తక్కువ టైమ్ లోనే పెద్ద సినిమాల్లో స్టార్ హీరోల పక్కన నటించే అవకాశం దక్కించుకుని టాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్ట్ లోకి చేరింది.
ఒకవైపు టాలీవుడ్ లో తన సత్తా చాటుకుంటూనే, బాలీవుడ్ లో, కోలీవుడ్ లో తన లక్ ను పరీక్షించుకుంటుంది. కార్తి సరసన తమిళ్ లో చేసిన సుల్తాన్ మూవీ రిలీజ్ అయి ఫర్వాలేదనిపించుకుంటుంది. బాలీవుడ్ లో మిషన్ మజ్ను సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్ర సరసన నటిస్తుంది. అది సెట్స్ పై ఉండగానే మరో ఆఫర్ కూడా దక్కించుకుంది రష్మిక. ఏకంగా మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ అమ్మడు. గుడ్ బై సినిమాలో రష్మికను ఓకే చేశారు మేకర్స్.
ఇవాళే ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని స్వయంగా రష్మికనే చెప్పింది. గుడ్ బై సినిమాలో భాగమైనందుకు ఎంతో థ్రిల్లింగ్ గా ఉందంటూ బాలీవుడ్ లో తనకొచ్చిన మరో ఆఫర్ గురించి అనౌన్స్ చేసింది రష్మిక. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా సక్సెస్ అయినా సరే రష్మిక కు ఆఫర్లు రావడం ఖాయమని తెలుస్తుంది.













