చాణక్య ఫస్ట్‌లుక్ విడుదల
గోపిచంద్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం చాణక్య. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. మెహరీన్ కథానాయిక. తిరు దర్శకత్వం వహిస్తున్నారు. రామ బ్రహ్మం సుంకర నిర్మాత. గోపిచంద్ పుట్టిన రోజు సందర్భంగా చాణక్య ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. తీక్షణమైన చూపులు, గుబురు గడ్డంతో గోపీ చంద్ మరింత మాసీగా కనిపిస్తున్నాడు. యాక్షన్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ ఇది. గోపిచంద్ పాత్ర, కథలో మలుపులు ఆకట్టుకుంటాయని, యాక్షన్ ఘట్టాలని అధిక ప్రాధాన్యం ఇచ్చామని చిత్రబృందం చెబుతోంది. విశాల్ చంద్రశేఖర్ స్వరాలు సమకూరుస్తున్నారు.













