NC24: చైతన్య సినిమాకు మార్కెట్ ను మించిన బడ్జెట్

తండేల్(thandel) మూవీతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న అక్కినేని నాగచైతన్య(akkineni naga chaitanya) ప్రస్తుతం విరూపాక్ష(virupaksha) డైరెక్టర్ కార్తీక్ దండు(karthik dandu) దర్శకత్వంలో తన 24వ సినిమాను NC24(NC24)గా చేస్తున్న సంగతి తెలిసిందే. మిస్టిక్ థ్రిల్లర్ జానర్ లో రూపొందుతున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా కోసం చైతన్య కూడా చాలానే కష్టపడుతున్నాడు.
ఈ సినిమాను కార్తీక్ రెగ్యులర్ సినిమాలాగా కాకుండా చాలా భిన్న కథాంశంతో తెరకెక్కిస్తున్నాడని, కథ చాలా బాగా వచ్చిందని, అందుకే ఈ సినిమా కోసం చైతూ మార్కెట్ ను మించి నిర్మాతలు ఖర్చు పెడుతున్నారని తెలుస్తోంది. బీవీఎస్ఎన్ ప్రసాద్(BVSN Prasad) నిర్మిస్తున్న ఈ సినిమాకు మైథలాజికల్ కనెక్షన్స్ ఉండటం వల్ల సినిమాకు భారీ సెట్ లు అవసరమవుతున్నాయట.
సెట్ల నిర్మాణానికే బడ్జెట్ భారీగా అవుతుందని, సినిమా మొత్తం పూర్తయ్యే సరికి రూ. 80 కోట్లు దాటేట్లుందని అంటున్నారు. చైతూను చూసుకుని అంత బడ్జెట్ పెట్టడం రిస్కే అయినప్పటికీ నిర్మాతలు కంటెంట్ పై నమ్మకంతో ఏమీ ఆలోచించకుండా ఎక్కడా రాజీపడకుండా ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తోంది. మీనాక్షి చౌదరి(meenakshi chaudhary) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో కూడా మేకర్స్ తొందరపడకుండా ప్రశాంతంగా షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. మొత్తం పూర్తయ్యాకే రిలీజ్ డేట్ గురించి ఆలోచిద్దామనుకుంటున్నారట దర్శకనిర్మాతలు.