విడో తో లవ్ స్టోరీ.. ఏ మాత్రం వర్కవుట్ అవుతుందో..?
ఆరెక్స్ 100 సినిమా సూపర్ హిట్ అందుకున్న హీరో కార్తికేయ.. ఆ తర్వాత సినిమాలు చేసినా కానీ ఆ రేంజ్ హిట్ మాత్రం కొట్టలేదనే చెప్పాలి. హిట్ వచ్చినా రాకపోయినా హీరోకు అవకాశాలు మాత్రం బానే వస్తున్నాయి. అందుకే సినిమా హిట్టూ ఫట్టూ తేడా లేకుండా సినిమాలు చేస్తూ పోతున్నాడు. ఆ విధంగానే తాజాగా చావు కబురు చల్లగా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.
ఇప్పటికే ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచేశాడు. ట్రైలర్ చూస్తే సినిమాలో కామెడీకి కొదవలేదని అర్థమవుతుంది. బస్తీ బాలరాజ్ క్యారెక్టర్ అనే పాత్రలో కార్తికేయ నటించగా.. భర్తలేని మహిళ పాత్రలో మల్లికగా లావణ్య త్రిపాఠి కనిపించనుంది. ఈ సినిమాలో భర్తలేని వితంతువు చుట్టూ ప్రేమ అంటూ తిరుగుతూంటాడు హీరో బస్తీ బాలరాజ్. చూడటానికి ఇద్దరి మధ్య సన్నివేశాలు ఆకస్తికరంగానే ఉన్నాయి కానీ వితంతువు వెనుకబడటం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
నిజానికి విడోతో ప్రేమాయణం కాన్సెప్ట్ చాలా సినిమాల్లో చూపించారు కానీ అవన్నీ సరైన కారణాలతో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంటాయి. ఇది వరకు సింధూర పువ్వు అనే సినిమాక్కూడా విడోకు హీరోకు మధ్య లవ్ నేపథ్యంలో తెరకెక్కింది. ఆ సినిమా పాటలతో ఎమోషనల్ సన్నివేశాలతో బాక్సాఫీస్ దగ్గర హిట్ అందుకుంది. అలాగని ఈ చావు కబురు చల్లగా సినిమాను అప్పటి సింధూర పువ్వుతో పోల్చలేం. ఎందుకంటే ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీతో తెరకెక్కింది. బ్యాక్ డ్రాప్ లో సరైన స్టోరీ లేకపోతే మాత్రం కష్టమనే చెప్పాలి. సినిమాలో ఎంత కామెడీ ఉన్నా కథ కథనాలు సరిగా లేకపోతే ఫట్ మనడం ఖాయం. ట్రైలర్ పరంగా అయితే సినిమా సక్సెస్ అయింది కానీ మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.













