విశ్వనాథ్ దంపతులకు వెంకయ్యనాయుడు సన్మానం
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ దంపతులకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సన్మానం చేశారు. ఢిల్లీలోని వెంకయ్య నాయుడు నివాసంలో ఈ సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖమంత్రి అశోక్ గజపతిరాజు, బిజెపి నేత, సీనియర్ నటుడు కృష్ణంరాజు, నిర్మాత దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మన వ్వవస్థ చిన్నాభిన్నం కాకుండా, మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, కుటుంబ వ్వవస్థ ఇలాగే కొనసాగాలనే విషయంలో విశ్వనాథ్ గారు చేసిన కృషి ఎప్పటికి మరిచిపోలేమన్నారు. ఆయన సినిమాల్లో జుగుస్సు, హింస, డ్యూయెట్లు, లేకపోయినా హిట్ అవడానికి కారణం నేటివిటి. మన సంస్కృతి దర్పణం పట్టేవిధంగా భారతీయ జన జీవనానికి దర్పణం పట్టేట్టుగా వాస్తవసరిస్థితులు ఆయన చూపించారు. సినిమా ఊహల్లో విహరింపజేస్తుంది. వాస్తవానికి కొద్దిగా దూరంగా ఉంటుంది. అలా కాకుండా వాస్తవానికి దగ్గరగా విశ్వనాథ్ గారి సినిమాలు ఉంటాయని వెంకయ్య కొనియాడారు. నేటి తరానికి ఆదర్శప్రాయుడు విశ్వనాథ్‌ను అని ఆయన ప్రశంసించారు.













