హాయ్ నాన్నకు సీడెడ్ సమస్య
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని నుంచి వస్తున్న సినిమా హాయ్ నాన్న. ఈ సినిమాతో శౌర్యువ్ కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. సలార్ సినిమా కోసం ముందు అనుకున్న డేట్ కంటే త్వరగా రావడం ఈ సినిమాకు ప్లస్ అవుతున్నప్పటికీ సినిమా ప్రమోషన్స్ విషయంలో కాస్త పెద్ద భారమే ఉంది.
బిజినెస్ పరంగా హాయ్ నాన్న సినిమాకు ఓ సమస్య ఎదురవుతంది. పోస్టర్స్, టీజర్, సాంగ్స్ రిలీజ్ అయ్యాక హాయ్ నాన్న సినిమా ఎమోషనల్ డ్రామా అని ఫ్యాన్స్ ఓ అంచనాకు వచ్చేశారు. కూతురు సెంటిమెంట్‌తో పాటూ హీరోయిన్ తో మంచి కెమిస్ట్రీ ఉందనే క్లారిటీ రావడంతో ఈ సినిమా గురించి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ వచ్చింది.
కానీ సమస్యంతా మాస్ వర్గాల నుంచే. హాయ్ నాన్న సినిమా నిర్మాతలు సీడెడ్ లాంటి ఏరియాల్లో కూడా పెద్ద రేట్లు చెప్తున్నారట. కానీ ఇది కమర్షియల్ సినిమా కాకపోవడంతో సీడెడ్ లో అంత భారీ రేట్లు పెట్టి కొనడానికి బయ్యర్లు ఆలోచిస్తున్నారట. మరి ఈ సమస్యను నిర్మాతలు ఎలా హ్యాండిల్ చేస్తారో కానీ, హాయ్ నాన్న సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయితే థియేటర్లు కళకళలాడిపోవడం ఖాయం. ఈ సినిమాతో పాటూ నితిన్ ఎక్స్ట్రా సినిమా కూడా అదే వారం ప్రేక్షకుల ముందుకు రానుంది.













