నారా చంద్రబాబు నాయుడు పాత్రలో వినోద్ నువ్వుల ‘చంద్రోదయం’
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఆయన జీవితంలోని కీలకఘట్టాలతో ‘చంద్రోదయం’ పేరుతో బయోపిక్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. పి.వెంకటరమణ దర్శకత్వంలో జి.జె.రాజేంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మోహన శ్రీజ సినిమాస్, శ్వేతార్క గణపతి ఎంటర్ప్రైజెస్ బ్యానర్స్‌పై సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ బయోపిక్ మూవీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుగా వినోద్ నువ్వుల నటిస్తున్నారు. తాజాగా సోమవారం నాడు ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్స్‌లో వినోద్ నువ్వుల చంద్రబాబును అనుకరిస్తూ సైకిల్‌పై ప్రజలకు అభివాదం చేస్తున్న పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. అయితే ఎన్టీఆర్ బయోపిక్, వైఎస్ఆర్ బయోపిక్ మూవీలతో పోల్చుకుంటే లీడ్ రోల్‌కి పర్ఫెక్ట్గా సూట్ అయినట్టు లేదు. ఎన్టీఆర్ బయోపిక్ మూవీలో ఎన్టీఆర్‌గా బాలయ్య, వైఎస్ఆర్ బయోపిక్‌లో వైఎస్ఆర్గా మమ్ముట్టి ఆయా పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసినట్లుగా ఫస్ట్ లుక్స్ ఉన్నాయి. అయితే చంద్రోదయం మూవీలో చంద్రబాబు పాత్రధారి చంద్రబాబు కంటే చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు. తెలుపు రంగు గెడ్డం అతికించినట్టుగా ఉంది. దీనికి తోడు పోస్టర్స్ కూడా మూవీ స్టిల్స్ కోసం తీసినట్టుగా ఉన్నాయి తప్పతే.. చంద్రన్న అభిమానులకు కిక్ ఇచ్చేట్టుగా లేవు. ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడి పాత్రలొ నటిస్తోన్న వినొద్ నువ్వుల లుక్‌కి మంచి స్పందన వస్తుంది. ‘చంద్రోదయం’ చిత్రీకరణ పూర్తైంది. నారా వారి పల్లె, తిరుపతి, హైదరాబాద్ ,అమరావతి, సింగపూర్ లాంటి లొకేషన్స్‌లో కీలక సన్నివేశాలను షూట్ చేసారు నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.













