రియా చక్రవర్తిపై కేసు నమోదు చేసిన సిబిఐ
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తదనంతర పరిణామాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా సుప్రీంకోర్టు ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించిన విషయం విదితమే. తన కుమారుడి ఖాతా నుంచి రూ.10 కోట్లు మొత్తం పోయిందని కెకెసింగ్ ఫిర్యాదు చేశారు. ఇదే కాకుండా రియాపై సుశాంత్ తండ్రి కెకెసింగ్ అనేక ఆరోపణలు చేసిన నేపధ్యంలో కెకెసింగ్ ఫిర్యాదుతో రియా చక్రవర్తిపై ఆమె కుటుంబ సభ్యులు 6గురిపై కూడా సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారు. రియా ఆస్తుల్ని కూడా సిబిఐ ఆరా తీస్తోంది. ఆమె పేరిట రూ.50లక్షలు విలువ చేసే ఫ్లాట్ ఉన్నట్టు గుర్తించింది. ఈ ఫ్లాట్ కొనడానికి డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయనేదానిపై సిబిఐ ఆరా తీస్తోంది.













