విజయ్ దేవరకొండకు జోడీగా కేథరిన్
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఓనమాలు, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు చిత్రాల ఫేమ్ క్రాంతిమాధవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖారారు చేయలేదు. ఇందులో కేథరిన్‌ను ఓ నాయికగా ఎంపిక చేశారు. చిత్ర ప్రారంభోత్సవంలో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, ఇసబెల్లా నాయికలు అని ప్రకటించారు. కేథరిన్‌తో ఈ చిత్రంలో మొత్తం నలుగురు కథానాయికలు అన్నమాట. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతోంది. సింగరేణి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ చిత్రానికి గోపీసుందర్ స్వరకర్త.













