రవితేజ సరసన కేథరిన్ ?
రవితేజ డిస్కోరాజా కోసం ఇటీవలే రంగంలోకి దిగాడు. త్వరలోనే మరో చిత్రాన్ని కూడా ఆయన మొదలు పెట్టనున్నట్లు సమాచారం. తమిళంలో విజయవంతమైన తెరి రీమేక్‌గా రూపొందనున్న చిత్రమిది. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రవితేజ సరసన కేథరిన్‌ని ఎంపిక చేశారని సమాచారం. మరో కథానాయికకీ చోటుందని తెలుస్తోంది. ఈ కథకి రవితేజ ఎప్పుడో పచ్చజెండా ఊపేశారు. కానీ ఆలస్యంగా పట్టాలెక్కుతోంది. మాతృకకీ పూర్తి భిన్నంగా దర్శకుడు ఈ కథని సిద్ధం చేసినట్టు సమాచారం. వచ్చే నెలలోనే మొదలు పెట్టి, దసరాకి విడుదల చేసే ఆలోచనలో చిత్రబృందం ఉందని సమాచారం.













