అక్కడ పుల్…ఇక్కడ నిల్
దక్షిణాదిలో ఎక్కడ అవకాశాలు లభించినా అక్కడి చిత్రాలు చేసుకుంటూ పోతున్న కేథరిన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇద్దరమ్మాయిలతో, సరైనోడు, నేనే రాజు…నేనే మంత్రి వంటి విజయవంతమైన సినిమాలతో పాటు ఎర్రబస్సు, గౌతమ్నంద వంటి కొన్ని ఫెయిల్యూర్ సినిమాలలో కూడా అమె నటిచింది. పైపెచ్చు ప్రత్యేక పాటకు కూడా తాను సిద్దమంటూ జయ జానకి నాయక చిత్రంలో కూడా నర్తించింది. అయితే ఆ తర్వాత తెలుగులో ఆమెకు సినిమాలే లేకుండా పోయాయి. ప్రస్తుతం ఆమె తమిళ, మలయాళ చిత్రాలలో నటిస్తూ అక్కడ బిజీగానే ఉంది. తెలుగులో మళ్లీ అవకాశాలొస్తాయని ఆమె ఎదురుచూస్తోంది. ఆ మధ్య రవితేజ నటించబోయే నూతన చిత్రంలో కూడా కేథరిన్ పేరు వినిపించింది. అయితే అ అంశంపై ఇంకా సృష్టత రాలేదు. ఇక తెలుగులో విజయం సాధించిన అత్తారింటికి దారేది చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. సుందర్.సి. దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ పాత్రను శింబు, నదియా పోషించిన పాత్రను ఖుష్బూ, సమంత పాత్రను మేఘా అకాశష్ పోపిస్తున్నారు. ఇక రెండవ కథానాయికగా నటించిన ప్రణీత పాత్రను ఎవరు పోషించనున్నారన్న అంశంపై ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో కేథరిన్ ఎంపిక చేశారని వినిపిస్తోంది. జార్జియాలో మొదటి షెడ్యూల్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ను హైదరాబాద్లో చేస్తారని సమాచారం.













