మంగళవారంలో ఊహించని మలుపులు
పాయల్ రాజ్‌పుత్ ప్రధానపాత్రలో అజయ్ భూపతి డైరెక్షన్లో వస్తున్న సినిమా మంగళవారం. వచ్చే వారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా పై మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నప్పటికీ, ట్రైలర్ తో ఆ అంచనాలు మరింత పెరిగాయి. దానికి తోడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏకంగా ఐకాన్ స్టార్ రానుండటంతో ఈ సినిమా స్థాయి నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లింది.
దీంతో ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని బయ్యర్లు నమ్మకం పెట్టుకున్నారు. రీసెంట్ గా వచ్చిన మా ఊరి పొలిమేర2 సినిమా సక్సెస్ అవడం చూసి, మంగళవారం మేకర్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. సరైన కంటెంట్‌తో ఆడియన్స్ ను కనెక్ట్ చేస్తే సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని అర్థమైపోయింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక ట్విస్ట్ కథను ఎవరూ ఊహించని మలుపులు తిప్పుతుందని సన్నిహిత వర్గాల సమాచారం. పాయల్ కామవాంఛతో రగిలిపోవడం, తన కోరికల వల్లే ఊహించని ఘోరాలు జరిగి కథనం చాలా సీరియస్‌గా సాగుతుందని ఇన్సైడ్ టాక్. పాయల్ క్యారెక్టర్ ను డైరెక్టర్ అజయ్ తీర్చిదిద్దిన విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుందని, ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని అంటున్నారు. ఆ వారం పెద్దగా సినిమాలు కూడా లేవు కాబట్టి ఆ అవకాశాన్ని మంగళవారం ఏ విధంగా క్యాష్ చేసుకుంటుందో చూడాలి.













