నానితో త్రివిక్రమ్ మూవీ?
అల వైకుంఠపురములో సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్, తన తర్వాతి సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ సహ నిర్మాతగా పవన్ కళ్యాణ్ సినిమాలు, సితార బ్యానర్ వ్యవహారాలతో బిజీ అయ్యాడు. అందుకే ఇప్పుడు మహేష్ తో చేస్తున్న గుంటూరు కారం సినిమాతో తన స్టామినాను రెట్టింపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సినిమా సెట్స్ లో ఉండగానే అవాంతరాలు, హీరోయిన్ మార్పు, మహేష్ ఫ్యామిలీలో విషాదాలు, ఫైట్ మాస్టర్, సినిమాటోగ్రఫర్ మార్పులతో చాలా గందరగోళమే జరిగింది. ఒకప్పుడు ఏదేమైనా సరే సంక్రాంతికి థియేటర్లలో మహేష్ మాస్ చూడబోతున్నామని ఫ్యాన్స్ గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ బన్నీతో ఇప్పటికే ఓ సినిమాను అనౌన్స్ చేశాడు.
కానీ బన్నీ పుష్ప2 రిలీజయ్యే వరకు ఫ్రీ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి, ఈ లోపు త్రివిక్రమ్ నేచురల్ స్టార్ నానితో ఓ మీడియం బడ్జెట్ మూవీని ప్లాన్ చేస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్. ఇంకా ఈ విషయంలో ఎలాంటి డీటెల్స్ బయటకు రాలేదు కానీ ఈ కాంబో వర్కవుట్ అయ్యే ఛాన్సులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో నితిన్ తో త్రివిక్రమ్ చేసిన అఆ లాంటి స్వీట్ సినిమానే త్రివిక్రమ్ నానితో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి ఫిబ్రవరి వరకు వెయిట్ చేస్తే క్లారిటీ వచ్చేస్తుంది.













