పొలిమేర2కు ప్రమోషన్స్ భలే వర్కవుట్ అయ్యాయే
ఓటీటీ సినిమాకు సీక్వెల్ తీయడమే గ్రేట్ అంటే దాన్ని మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేయాలనే ఆలోచన రావడం గ్రేట్ కంటే రిస్క్ అని చెప్పాలి. అలాంటి సినిమాను థియేటర్లకు వెళ్లి చూడాలనే క్రేజ్‌ను ఆడియన్స్‌లో క్రియేట్ చేయగలడమంటే మామూలు ఛాలెంజ్ కాదు. రెండేళ్ల కిందట కరోనా టైమ్ లో హాట్ స్టార్ లో వచ్చిన మా ఊరి పొలిమేర.
చేతబడుల చుట్టూ నడిపిన ఈ థ్రిల్లర్ ఆడియన్స్ ను బాగానే ఎంగేజ్ చేసింది. దెయ్యాల సినిమా కాకపోయినా దాన్ని డైరెక్టర్ హ్యాండిల్ చేసిన విధానం ఆడియన్స్‌ను మెప్పించింది. ఆ ఎంకరేజ్మెంటే ఇప్పుడు డైరెక్టర్ తో సెకండ్ పార్ట్ తీయించేలా చేసింది. ఇక్కడ వరకు బానే ఉంది కానీ స్టార్ క్యాస్టింగ్ లేని ఈ సినిమాకు ఉన్నట్లుండి బజ్ పెరగడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
నవంబర్ 3న కీడా కోలా తప్ప చెప్పుకోదగ్గ రిలీజ్లేమీ లేవు. దానిక్కూడా మంచి హైప్ లేదు కానీ రిలీజ్ తర్వాత బజ్ పెరుగుతుందని నమ్మకంతో ఉన్నారు. ఇలాంటి ఛాన్స్‌ను మా ఊరి పొలిమేర2 టీమ్ ప్రమోషన్స్ తో బాగా ఉపయోగించుకుంటున్నారు. ఈ ప్రమోషన్స్ ఎలా పనిచేశాయంటే ట్రైలర్ వచ్చాక ఫస్ట్ పార్ట్‌ను హాట్ స్టార్ లో మళ్లీ చూసేంతగా. పొలిమేర2 కచ్ఛితంగా ఫ్యాన్స్‌ను థ్రిల్ చేస్తుందని మేకర్స్ పదే పదే చెప్తున్నారు. ఏదేమైనా పొలిమేర2 టీమ్ ప్లాన్ చేసుకున్నట్లు వారి ప్రమోషన్స్ అయితే ఆడియన్స్ లోకి బాగానే చేరాయి.













