కంగువను బాహుబలితో పోలుస్తున్న తమిళ బయ్యర్లు
నవంబర్ 14న రిలీజ్ కానున్న కంగువ(Kanguva) సినిమా కోసం హీరో సూర్య(Suriya) ప్రమోషన్ టూర్ ను ఆల్రెడీ మొదలుపెట్టాడు. ముంబై నుంచి నార్త్ మొత్తం తిరుగుతూ మీడియాకు ఇంటర్వ్యూలిస్తూ, ఫ్యాన్స్ తో మీటింగ్స్ జరుపుతూ ఉన్నాడు. డైరెక్టర్ శివ(Siva), హీరోయిన్ దిశా పటానీ(Disha Patani), మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్(Devi sri prasad), విలన్ బాబీ డియోల్(Bobby Deol) అందరూ కలిసి కంగువను ప్రమోట్ చేస్తున్నారు.
అయితే ఈ సినిమాను కోలీవుడ్ బాహుబలి(Kollywood baahubali)గా తమిళనాడు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు, సినీ ప్రియులు పిలుచుకుంటున్నారు. బాహుబలి(Baahubali) లాగానే కంగువ(Kanguva) కూడా రికార్డులు బ్రేక్ చేసి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. డైరెక్టర్ శివ ఆఖరి చిత్రం పెద్దన్న(Peddhanna) దారుణమైన ఫ్లాప్ అయినప్పటికీ నిర్మాత జ్ఞానవేల్ రాజా(Gnanavel raja) ఈ సినిమా కథను ఎంతగానో నమ్మి దానిపై కోట్లు ఖర్చు పెట్టాడు.
ఆయనకు ఈ సినిమాపై ఎంతో నమ్మకం ఉంది. నమ్మకముంటే బాగానే ఉంది కానీ బాహుబలితో పోలికే విచిత్రంగా ఉంది. గతంలో విజయ్(Vijay) కూడా ఇలానే ఆలోచించి పులి(Puli) సినిమా చేసి దారుణమైన ఫ్లాప్ ను ఎదుర్కొన్నాడు. తర్వాత బాహుబలిని చూసి సుందర్ సి(Sundar C) కొన్నేళ్ల కిందట సంఘమిత్ర(Sangha mithra) అనే మల్టీస్టారర్ ను అనౌన్స్ చేశాడు కానీ ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయింది. ఇప్పుడు కంగువ ఈ నెగటివ్ సెంటిమెంట్స్ అన్నింటినీ బ్రేక్ చేసి హిట్ అవాలి. మరి కంగువ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













