వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న మన తెలుగు బుట్ట బొమ్మ
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మ్యూజిక్ సెన్సేషన్ తమన్ కలయికలో వచ్చిన అల వైకుంఠపురములో తెలుగు చిత్ర సీమలో కొత్త అధ్యాయాన్ని తెరిచింది. ఇండస్ట్రీ హిట్ కొట్టిన బన్నీ నైజాంలో దాదాపు 40కోట్లు కొల్లగొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. బాక్సాఫీస్ లెక్కలు కాకుండా సోషల్ మీడియాలో క్రియేట్ చేసే రికార్డులు ఓ రేంజ్లో ఉంటాయి. వందల మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొడుతూ… ఇప్పటికీ రికార్డులు కొల్లగొడుతూనే ఉంది.
రికార్డుల పరంపలు.. అల వైకుంఠపురములో బాక్సాఫీస్ లెక్కలన్నీ ఓ పక్క.. సోషల్ మీడియాలో రికార్డులు ఓ లెక్క. తాజాగా తెలుగు చిత్ర సీమ టాప్ 100 గ్లోబల్ వీడియో సాంగ్స్‌లో అల వైకుంపురములోని రెండు పాటలు (బుట్టబొమ్మ, రాములో రాముల) చోటు దక్కించుకున్నాయి.
అల ఆల్బమ్స్ వైరల్.. అల వైకుంఠపురములో సినిమా ఎంతటి విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. అయితే అందులో తమన్ అందించిన సంగీతమే ప్రథమ పాత్రను పోషిస్తుంది. ఇప్పటికీ ఆల్బమ్ ఓ రేంజ్లో ట్రెండ్ సెట్ చేస్తోంది. ఖండాంతరాలు దాటిన బుట్టబొమ్మ.. బుట్టబొమ్మ ఆడియో పరంగా ఎంతటి సంచలనాన్ని నమోదు చేసిందో.. విజువల్ పరంగానూ అంతే సెన్సేషన్ క్రియేట్ చేసింది. రీసెంట్గా బుట్టబొమ్మ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఆస్ట్రేలియన్ క్రికేటర్ డేవిడ్ వార్నర్ టిక్ టాక్ చేయగా ఓ రేంజ్లో వైరల్ అయింది. మిలియన్ల సాంగ్.. బుట్టబొమ్మ పాట ఎంతగా వైరల్ అయిందో టిక్ టాక్‌ను చూస్తే తెలుస్తుంది. యూట్యూబ్‌లో రెండు వందల మిలియన్లకు పైగా వీక్షణలు దక్కించుకుని సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. అల వైకుంఠపురములో రికార్డుల వేటలో ఇంకా దూసుకుపోతూనే ఉంది.ముంచు ముందు ఇక ఇంకెన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి.













