బర్త్ డే రోజున క్లారిటీ ఇవ్వనున్న బన్నీ
వచ్చే నెల ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా వచ్చే అప్డేట్స్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దానికి రీజన్ లేకపోలేదు. మీడియాలో, ఫ్యాన్స్ లో నెలకొన్న రెండు ముఖ్యమైన డౌట్స్ కు ఆ రోజు క్లారిటీ వచ్చే ఛాన్సుంది. అందులో మొదటిది పుష్ప2 రిలీజ్ డేట్. మైత్రీ నిర్మాతలు ఆగస్ట్ 15 అంటున్నప్పటికీ పోస్ట్ పోన్ గురించి మాత్రం ప్రచారాలు ఆగట్లేదు.
అందుకే బన్నీ బర్త్ డే రోజున స్పెషల టీజర్ తో పాటూ రిలీజ్ డేట్ కూడా ఉండేలా కొత్త కంటెంట్ ను రిలీజ్ చేస్తారంటున్నారు. దీని కోసం ఇప్పటికే పోస్టర్ల డిజైన్ కూడా జరుగుతుందని టాక్. ఇక రెండోది పుష్ప2 తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేస్తాడనే విషయం. డైరెక్టర్ అట్లీతో సినిమా ఓకే అయిందంటూ రెండ్రోజులుగా ప్రచారం జరుగుతుంది.
పైగా రీసెంట్ గా స్టోరీ సిట్టింగ్స్ కు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. మరి బన్నీ, అట్లీతో సినిమా చేస్తే త్రివిక్రమ్ తో అనుకున్న సినిమా సంగతేంటనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇది లేటయితే కనీసం ప్రొడక్షన్ హౌస్ నుంచి బర్త్ డే విషెస్ పోస్టర్ లాంటిదైనా రావాలి. ఏదైనా ఈ అనుమానాలన్నింటికీ బన్నీ బర్త్ డే రోజున క్లారిటీ రానుంది.













