Mithra Mandali: ‘మిత్ర మండలి’కి ఫ్యామిలీతో రండి.. అందరినీ మనస్పూర్తిగా నవ్విస్తాం.. బన్నీ వాస్

బీవీ వర్క్స్ బ్యానర్ మీద బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్ మీద కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మించిన చిత్రం ‘మిత్ర మండలి’ (Mithra Mandali). ఈ మూవీలో ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు విజయేందర్ దర్శకత్వం వహించారు. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సత్య, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విటివి గణేష్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న విడుదల చేస్తున్నారు. ఇక కంటెంట్ మీదున్న నమ్మకంతో అక్టోబర్ 15న సాయంత్రం ప్రీమియర్లతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ప్రీమియర్ల ప్రదర్శన కంటే ముందు చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో..
బన్నీ వాస్ మాట్లాడుతూ .. ‘‘మిత్ర మండలి’ ప్రీమియర్లకు మంచి స్పందన వస్తోంది. డిమాండ్ పెరుగుతుండటంతో స్క్రీన్లను పెంచుకుంటూ వెళ్తున్నాం. సెకండ్ షోలకి కూడా డిమాండ్ పెరిగింది. విజయవాడ, వైజాగ్‌లోనూ ప్రీమియర్లకు డిమాండ్ పెరిగింది. ప్రీమియర్లతో వచ్చే మౌత్ టాక్‌తో మరింత ప్రయోజనం చేకూరుతుందని మేం భావిస్తున్నాం. దీపావళి పండుగ 21 అయితే.. నవ్వుల పండుగ మాత్రం ఈ రోజు సాయంత్రం మా ప్రీమియర్లతో స్టార్ట్ అవుతుంది. అందరూ ఫ్యామిలీతో సినిమాకు రండి.. అందర్ని హాయిగా నవ్వించి బయటకు పంపిస్తాం. మనస్పూర్తిగా నవ్విస్తామని మాత్రం చెప్పగలను. ఇప్పటి వరకు అయితే మేం మంచి చిత్రాన్ని తీశామని అనుకుంటున్నాం. ఈ మూవీ కోసం పని చేసిన నా టీంకు థాంక్స్. ఇప్పటి వరకు సహకరించిన మీడియాకి థాంక్స్’ అని అన్నారు.
ప్రియదర్శి మాట్లాడుతూ .. ‘‘మిత్ర మండలి’ అందరినీ నవ్వించేలా ఉంటుంది. మీమర్స్, ఆడియెన్స్‌కి చాలా కంటెంట్ ఇస్తాం. ఓ కొత్త కంటెంట్‌తో అందరి ముందుకు రాబోతోన్నాం. ఇక ఇందులో నేను డ్యాన్స్ మూమెంట్స్ కూడా చేయాల్సి వచ్చింది. ఇందులో మేం ఏం చేసినా కూడా సినిమా, స్క్రిప్ట్‌కు తగ్గట్టే ఉంటుంది. బన్నీ వాస్ గారు ఎప్పుడూ సినిమా కోసం తపిస్తూనే ఉంటారు. పది రోజుల నుంచి నిద్ర లేకుండా ఈ మూవీ కోసం పని చేస్తున్నారు. బన్నీ వాస్ గారిని చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఈ మూవీకి అసలు సిసలు హీరో ఆయనే’ అని అన్నారు.
నిహారిక ఎన్ ఎం మాట్లాడుతూ .. ‘‘మిత్ర మండలి’ లాంటి చిత్రంలో నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన టీంకు థాంక్స్. అసలు నన్ను ఇలాంటి పాత్రలో ఊహించి, తీసుకున్న డైరెక్టర్‌కు థాంక్స్. తెలుగులో ఇదే నాకు మొదటి చిత్రం. సాయంత్రం ప్రీమియర్లు పడుతున్నాయి. ఎలాంటి ఫలితం వస్తుందో అని నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. సినిమా పెద్ద హిట్ అవ్వాలని, అందరికీ మంచి పేరు రావాలని ఈరోజు దేవుడికి వంద సార్లు దండం పెట్టుకుని ఉంటాను’ అని అన్నారు.
దర్శకుడు విజయేందర్ మాట్లాడుతూ .. ‘‘మిత్ర మండలి’ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే.. ఏ పాత్ర ఎలా ప్రవర్తించాలి?.. ఎలా మాట్లాడాలి? అన్నది రాసుకున్నాను. నాకు మొదటి సినిమా కావడం, ఇంత మందిని హ్యాండిల్ చేయడం కాస్త ఇబ్బందిగానే అనిపించింది. కానీ నాకు బన్నీ వాస్ గారు మాత్రం చాలా సహకరించారు.
ఈ కార్యక్రమంలో మీడియా సంధించిన పలు ప్రశ్నలకు చిత్రయూనిట్ సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలో బన్నీ వాస్ ఏం చెప్పారంటే..?
* ‘మిత్ర మండలి’ ట్రైలర్ ఓ వర్గానికి బాగా నచ్చింది. మా మూవీ కంటెంట్ మీదున్న నమ్మకంతో ప్రీమియర్లు వేయాలని అనుకున్నాం. బుధవారం సాయంత్రం ప్రీమియర్లు వేస్తున్నా కూడా మంచి స్పందన వస్తోంది. చాలా వరకు అన్ని చోట్లా షోలు ఫుల్ అవుతున్నాయి. ఒక షో ఫుల్ అవుతూ ఉంటే.. ఇంకో షోని ఓపెన్ చేస్తున్నాం. ప్రీమియర్లతో రిస్క్ కూడా ఉంటుంది. ఆ రిస్క్‌ని కూడా నేను తీసుకునేందుకు సిద్దంగా ఉన్నాను.
* ‘మిత్ర మండలి’ మీద కావాలనే నెగెటివ్ క్యాంపైన్ చేస్తున్నారు. టీంలో చాలా మంది నిద్రలు లేకుండా పని చేస్తున్నారు. మేం ఇంత కష్టపడి మూవీని తీస్తుంటే కావాలని కొంత మంది అలా నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. ఇలాంటివి చేస్తున్నారని మన అందరికీ తెలుసు. కానీ మనలో ఎవ్వరూ మాట్లాడటం లేదు. అందుకే నేను అలా కాస్త గట్టిగా, ఎమోషనల్‌గా రెస్పాండ్ అయ్యాను. అలా నేను మాట్లాడిన తరువాత చాలా మంది ఫోన్ చేసి ‘చాలా బాగా మాట్లాడావ్’ అని అన్నారు.
* బయటి వ్యక్తులు వచ్చి నిర్మాతలను అప్రోచ్ అవుతున్నారని తెలిసింది. కొంత మంది నిర్మాతలు తెలిసో తెలియక ఇలాంటి నెగెటివ్ క్యాంపైన్‌లను సపోర్ట్ చేస్తున్నారు. పక్క సినిమాని తొక్కాలని చూడటం మాత్రం చాలా తప్పు. రాజకీయాల్లో ఇలాంటి ఎత్తుగడలు మామూలే. కానీ ఇండస్ట్రీలో ఇలాంటివి చేయడం తప్పు. మంచి సినిమాలు ఎప్పుడూ ఆడతాయి. ఒక మూవీని తొక్కితేనే ఇంకో మూవీ ఆడుతుంది అని అనుకోవడం మూర్ఖత్వం.
* నా చేతిలో ఉన్న థియేటర్లకి కూడా మిగిలిన చిత్రాలకు ఛాన్స్ ఇచ్చాను. నా మూవీని రెండు షోలు వేస్తే.. మిగతా చిత్రాలకు రెండు షోలు ఇస్తున్నాను. అన్ని సినిమాలు బాగుండాలి.. అన్ని చిత్రాలు ఆడాలన్నదే నా ఉద్దేశం.
* విజయేందర్ కథ చెప్పిన నాలుగు గంటలు నేను నవ్వుతూనే ఉన్నాను. ఇక సినిమాలో యాడ్స్ అన్నీ పోను వాయిస్ ఓవర్, టైటిల్ నుంచి రెండు గంటల 12 నిమిషాలు కడుపుబ్బా నవ్విస్తాం. కొన్ని చోట్ల కొంత మంది మీద సెటైర్లు పడతాయి. ఏదో సరదాగా నవ్వించేందుకు మాత్రమే చేశాం. ఎవ్వరినీ కించపర్చాలని, ఇబ్బంది పెట్టాలని మాత్రం అలా చేయలేదు. విజయ్ చాలా బ్యాలెన్స్డ్‌గా కథను రాసుకున్నారు. జడ్జ్ చేయకుండా ఈ మూవీని చూస్తే మాత్రం అందరికీ నచ్చుతుంది.
* ‘మిత్ర మండలి’ చిత్రానికి అనుకున్న దాని కంటే ఎక్కువే పెట్టాం. భారీ తారాగణం, వారి డేట్లు, మధ్యలో ఇండస్ట్రీలో స్ట్రైక్ ఇలా అన్నింటితో కలిపి బడ్జెట్ పెరిగింది. కానీ ఓ సినిమాని మనం ఎత్తుకున్న తరువాత ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా పూర్తి చేయాలి. ఈ మూవీ అన్ని రకాలుగా మాకు లాభాల్ని తెచ్చి పెడుతుందని నమ్ముతున్నాను.
* బుక్ మై షోలోనూ ఇష్టమున్నట్టుగా రేటింగ్, లైక్స్ కనిపిస్తుంటాయి. ఎవరు లైక్ కొడుతున్నారు.. ఏ బేస్ మీద రేటింగ్ ఇస్తున్నారు? అన్న బేసిక్ ఇన్ ఫో కూడా ఉండదు. టికెట్ కొనుక్కునే ఫ్లాట్ ఫాం మీద కూడా ఇలాంటివి ఉంటే ఎలా? బాగున్న సినిమాకు మంచి రేటింగ్ వస్తే పర్లేదు.. కానీ బాగున్న మూవీకి కూడా తప్పుడు రేటింగ్ ఇస్తే ఎలా? ఈ టాపిక్ మీద ఛాంబర్‌లోనూ చర్చించాం.