తండేల్ కథ చెప్పేసిన నిర్మాత
అక్కినేని నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా తండేల్. గీతా ఆర్ట్స్2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ కు ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ ఆఖరి దశలో ఉన్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న రిలీజ్ కానుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా కథను నిర్మాత బన్నీ వాసు బయట పెట్టాడు. గీతా ఆర్ట్స్2 బ్యానర్ లో వచ్చిన కొత్త సినిమా ఆయ్ ప్రమోషన్స్ లో భాగంగా బన్నీ వాసు తండేల్ కథను వివరించాడు. తండేల్ యదార్థ కథన్న విషయం ఇప్పటికే అందరికీ తెలుసు. తండేల్ సినిమా శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో జరగనుంది.
శ్రీకాకుళం దగ్గరున్న మచిలేశ్వరం నుంచి గుజరాత్ దగ్గర పనిచేయడానికి 21 మంది జాలర్లు కాంట్రాక్ట్ బేసిస్ లో వెళ్తారు. అక్కడ పనిచేస్తున్న వాళ్లు అనుకోకుండా పాకిస్తాన్ వాటర్స్ లోకి వెళ్లడం, అక్కడి సైన్యానికి దొరకడం జరుగుతుంది. ఆ సంక్లిష్ట పరిస్థితుల్లోనే కశ్మీర్లో ఆర్టికల్ 371 వచ్చింది. ఇలాంటి టైమ్ లో ఆ జాలర్లు తిరిగి ఇండియా ఎలా రాగలిగారనేదే కథ అని బన్నీ వాసు తండేల్ గురించి వివరించాడు. ఈ కథలోనే ఎంతో అద్భుతమైన లవ్ స్టోరీ కూడా ఉంటుందని, ఆ 21 మంది కోసం ఆడవాళ్లు ఎలా ఫైట్ చేస్తారో కూడా సినిమా చూపించనున్నట్లు బన్నీ వాసు తెలిపాడు.













