గ్యాప్ తీసుకోకుండా పని చేస్తున్న బన్నీ
ఆగస్ట్ 15న రిలీజ్ కావాల్సిన పుష్ప2 మంచి అవుట్‌పుట్ అందించేందుకు ఒక్కసారిగా డిసెంబర్ 6కి వాయిదా పడింది. మధ్యలో ఈ సినిమా నుంచి బ్రేక్ తీసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పూర్తిగా పుష్ప2 పనుల్లో బిజీ అయిపోయాడు. సుకుమార్ తో విబేధాలున్నాయని వార్తలొస్తున్నా వాటన్నింటిని పక్కకుపెట్టి మరీ బన్నీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
అయితే ముందుగా ఈ షెడ్యూల్ వారం మాత్రమే ఉంటుందని, తర్వాత బన్నీ కొంత రెస్ట్ తీసుకుంటాడని అనుకున్నారు. కానీ బన్నీ మాత్రం అసలు గ్యాప్ తీసుకోకుండా చిత్ర యూనిట్ కు అందుబాటులో ఉండి కుదిరినంత త్వరగా సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో స్పెషల్ సెట్స్ లో బన్నీపై యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తున్నాడు సుకుమార్.
ఈ షెడ్యూల్ స్టార్ట్ అయిన దగ్గరనుంచి బన్నీ అసలు టైమ్ వేస్ట్ చేయకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. సినిమాను చెప్పిన టైమ్ కు తీసుకురావాలని చిత్ర యూనిట్ రాత్రింబవళ్లు కష్టపడుతుంది. గతంలో పుష్ప1కు జరిగిన పొరపాట్లు పుష్ప2కు జరగకూడదని, ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయాలని బన్నీ డిసైడ్ అయ్యాడట. అన్ని పనులను నవంబర్ ఫస్ట్ వీక్ నాటికి పూర్తి చేసి, ఆ తర్వాత నెల రోజుల పాటూ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టాలని చూస్తున్నారట.













